యంత్రాంగం.. అప్రమత్తం
eenadu telugu news
Updated : 26/09/2021 07:18 IST

యంత్రాంగం.. అప్రమత్తం

గులాబ్‌ తుపాన్‌పై కలెక్టర్‌ సమీక్ష

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: భారత వాతావరణ కేంద్రం జారీ చేసిన గులాబ్‌ తుపాను హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈనెల 27 వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. కలెక్టర్‌ మల్లికార్జున డివిజన్‌, మండల స్థాయి అధికారులతో శనివారం టెలీ కాన్ఫరెన్సు నిర్వహించి పలు సూచనలు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. విశాఖ స్టీలుప్లాంట్‌ ఆవరణలోని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బలగాలను అప్రమత్తం చేశామని, అవసరమైన పక్షంలో తక్షణమే రంగంలోకి దిగే విధంగా సిద్ధంగా ఉండాలని ఆదేశించామన్నారు. ఇండియన్‌ నేవీ, ఇండియన్‌ కోస్టుగార్డు విభాగాల్లో ఉండే సహాయ బృందాలు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ను సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు కలెక్టర్‌ తెలిపారు.

* విశాఖ చేపలరేవు నుంచి సముద్ర జలాల్లోకి వేటకు వెళ్లిన బోట్లలో ఇంకా 200 వరకు తిరిగి రావాల్సి ఉంది. కొన్ని బోట్లు శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తీరానికి చేరుకొనే అవకాశం ఉంది. మరో 40 నుంచి 50 బోట్లు విశాఖకు బాగా దూరంగా ఉన్నాయి. వాటిని సమీపంలోని ఒడిశా తీరం వైపు వెళ్లాలని సూచించారు. మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు, ఏడీ గోవిందరావు శనివారం మధ్యాహ్నం చేపలరేవులో పర్యటించి బోటు ఆపరేటర్లతో మాట్లాడారు. సముద్రంలో వేట సాగిస్తున్న వారితో సెల్‌ఫోన్ల సహాయంతో మాట్లాడారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని