నర్సింగ్‌ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
eenadu telugu news
Published : 26/09/2021 03:40 IST

నర్సింగ్‌ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

 

గురుద్వారా, న్యూస్‌టుడే: విశాఖపట్నం జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల్లో జనరల్‌ నర్సింగ్‌ మిడ్‌ వైఫరీ మూడున్నర ఏళ్ల కోర్సులో ప్రవేశం కోసం దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ పి.ఎస్‌.సూర్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రవేశాలు పొందే అభ్యర్థులకు 17 ఏళ్లు నిండి ఉండాలని పేర్కొన్నారు. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డునుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలని, రిజిస్ట్రేషన్‌ రుసుము చెల్లించేందుకు అక్టోబర్‌ 12 ఆఖరు తేదీ అని పేర్కొన్నారు. దరఖాస్తులు అక్టోబర్‌ 23వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు విశాఖలోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో అందజేయాలని ప్రకటించారు. మరిన్ని వివరాలకు ఆ కార్యాలయం, dme.ap.nic.in. వెబ్‌ సైట్‌లో సంప్రదించాలని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని