Cyclone Gulab: పలు రైళ్ల రద్దు.. కొన్ని దారి మళ్లింపు
eenadu telugu news
Updated : 26/09/2021 09:06 IST

Cyclone Gulab: పలు రైళ్ల రద్దు.. కొన్ని దారి మళ్లింపు

రైల్వేస్టేషన్‌ (విశాఖ): గులాబ్‌ తుపాను నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు కొన్నింటి గమ్యాలు కుదించడం, మరి కొన్ని దారిమళ్లించి నడుపుతున్నట్లు వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. ఈ నెల 26న విశాఖ, విజయవాడ వైపు వెళ్లే 10 రైళ్లు.., విశాఖ, విజయనగరం వైపు నడిచే మరో 6 రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించారు. 27న విశాఖ మీదుగా రాకపోకలు సాగించే 6 రైళ్లను రద్దు చేశారన్నారు. ఈ నెల 26న పూరీ-ఓఖా ప్రత్యేక రైలును వయా ఖుర్థారోడ్‌, అంగూల్‌, సంబల్‌పూర్‌ మీదుగా దారి మళ్లించినట్లు పేర్కొన్నారు. 27న విశాఖలో బయలుదేరే విశాఖ-కిరండూల్‌ ప్రత్యేక రైలును జగదల్‌పూర్‌లో నిలిపేయడంతోపాటు తిరుగు ప్రయాణంలో ఈనెల 28న జగదల్‌పూర్‌ నుంచి బయలు దేరుతుందన్నారు. పలు సాంకేతిక కారణల వల్ల ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రయాణికులు గమనించి సహకరించాలని కోరారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని