నేర నిరూపణలో ఫోరెన్సిక్‌ సైన్స్‌ కీలక పాత్ర
eenadu telugu news
Published : 26/09/2021 03:40 IST

నేర నిరూపణలో ఫోరెన్సిక్‌ సైన్స్‌ కీలక పాత్ర

సబ్బవరం, న్యూస్‌టుడే: ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని పరిశోధకులు, పోలీసులు నేర పరిశోధన చేయాలని కశ్మీర్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్‌ మిరాజ్‌ ఉద్దీన్‌ మీర్‌ పేర్కొన్నారు. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో ఫోరెన్సిక్‌ సైన్స్‌, సాక్ష్యాల ప్రాధాన్యం అనే అంశం మీద రెండు రోజుల నిర్వహించనున్న కార్యశాల శనివారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్‌ మిరాజ్‌ ఉద్దీన్‌ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో సాంకేతికతను ఉపయోగించుకుని నేరస్థులు చట్టానికి దొరకకుండా నేరాలను చేయడానికి ప్రయత్నిస్తున్నారని అందువల్ల వాటిని చేధించడం కష్టంగా మారిందన్నారు. నేరాలను నిరూపించడంలో ఫోరెన్సిక్‌ సైన్స్‌ కీలక పాత్ర వహిస్తుందన్నారు. డీఎస్‌ఎన్‌ఎల్‌యూ ఉపకులపతి ప్రొఫెసర్‌ ఎస్‌.సూర్యప్రకాష్‌ మాట్లాడుతూ క్రిమినల్‌, సివిల్‌ కేసుల్లో ఫోరెన్సిక్‌ సైన్స్‌ ప్రాధాన్యాన్ని వివరించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ కె.మధుసూదనరావు, అకడమిక్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ దయానందమూర్తి, ప్రోగ్రాం కన్వీనర్‌ డాక్టర్‌ నందిని, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని