డాక్టర్‌ ఉదయ్‌కుమార్‌కు ఒయాసిస్‌ పురస్కారం
eenadu telugu news
Published : 26/09/2021 03:48 IST

డాక్టర్‌ ఉదయ్‌కుమార్‌కు ఒయాసిస్‌ పురస్కారం


డాక్టర్‌ ఉదయ్‌కుమార్‌కు జ్ఞాపిక అందజేస్తున్న ఒయాసిస్‌ ప్రతినిధులు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: ప్రముఖ ఎముకుల వైద్య నిపుణులు, కేజీహెచ్‌ ఎముకుల విభాగ విశ్రాంత ఆచార్యులు డాక్టర్‌ బి.ఉదయ్‌కుమార్‌కు దక్షిణాది రాష్ట్రాల ఎముకుల వైద్యుల సంఘం (ఒయాసిస్‌) పురస్కారం లభించింది. తమిళనాడు రాష్ట్రం సేలం వేదికగా ఈనెల 23న జరిగిన ఒయాసిస్‌ వార్షిక సదస్సులో ఉదయ్‌కుమార్‌ పురస్కారం అందుకున్నారు. ప్రతి రాష్ట్రం నుంచి ఎముకుల వైద్య రంగంలో విశేష సేవలందించే ఒక వైద్యునికి జీవిత సాఫల్య పురస్కారాలను ఒయాసిస్‌ అందించి సత్కరిస్తుంది. ఈ ఏడాది ఏపీ రాష్ట్రానికి సంబంధించి డాక్టర్‌ ఉదయ్‌కుమార్‌ను ఎంపిక చేసి జీవిత సాఫల్య పురస్కారంతో ఒయాసిస్‌ ప్రతినిధులు సత్కరించారు. గతంలో ఈ పురస్కారం నగరానికి చెందిన డాక్టర్‌ ఎస్‌వి ఆదినారాయణరావుకు లభించింది. ఒయాసిస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్‌ ఎం.రాఘవదత్‌, డాక్టర్‌ ఎ.ఎన్‌.కుట్టి, ఉపాధ్యక్షులు డాక్టర్‌ ఎస్‌.శ్రీనివాసరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ వైవీకే దుర్గాప్రసాద్‌, కార్యదర్శి డాక్టర్‌ నరేష్‌బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని