బీసీ కార్పొరేషన్‌ ఈడీ పెంటోజీరావుకు స్థాన చలనం
eenadu telugu news
Published : 26/09/2021 03:48 IST

బీసీ కార్పొరేషన్‌ ఈడీ పెంటోజీరావుకు స్థాన చలనం

 

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : బీసీ కార్పొరేషన్‌ కార్యనిర్వాహక సంచాలకులు పెంటోజీరావుకు విజయనగరం బదిలీ అయింది. తూర్పుగోదావరి జిల్లా ఎస్‌.ఈ.బి.కి చెందిన సూపరిండెంటెంట్‌ రమావత్‌ ప్రసాద్‌ను విశాఖ బీసీ కార్పొరేషన్‌ ఈడీగా డెప్యుటేషన్‌పై నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. విజయనగరంలో విధులు నిర్వహిస్తున్న నాగరాణిని కేంద్ర కార్యాలయానికి బదిలీ చేశారు. ప్రస్తుతం నాగరాణి బీసీ కార్పొరేషన్‌తో పాటు ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీగా అదనపు బాధ్యతలు వహిస్తున్నారు. కొత్తగా నియమితులైన రమావత్‌ప్రసాద్‌ త్వరలోనే బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని