నూతన ఆర్‌.జె.డి. బాధ్యతల స్వీకరణ
eenadu telugu news
Published : 26/09/2021 03:48 IST

నూతన ఆర్‌.జె.డి. బాధ్యతల స్వీకరణ


వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ ఆర్జేడీ పి.సుధాకర్‌కు పుష్పగుచ్ఛం

అందజేస్తున్న వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ కమిటీ ఛైర్మన్‌ బి.ఎస్‌.కృష్ణ

గోపాలపట్నం, న్యూస్‌టుడే: విశాఖపట్నం వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌గా పి.సుధాకర్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు. మొన్నటి వరకు విధులు నిర్వహించిన కె.శ్రీనివాసరావు స్థానంలో కడప నుంచి ఈయన బదిలీపై వచ్చారు. ఈనేపథ్యంలో వ్యవసాయ, మార్కెటింగ్‌ కమిటీ ఛైర్మన్‌ బి.ఎస్‌.కృష్ణ ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం నగరంలోని రైతుబజార్లలో నెలకొన్న సమస్యలను ఆయనకు వివరించారు. రైతుబజార్‌ల అభివృద్ధికి కృషి చేస్తానని ఆర్జేడీ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని