అదనపు ప్రభుత్వ న్యాయవాదిగా బలగ సత్యారావు
eenadu telugu news
Published : 26/09/2021 03:48 IST

అదనపు ప్రభుత్వ న్యాయవాదిగా బలగ సత్యారావు

విశాఖ లీగల్‌, న్యూస్‌టుడే: నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది బలగ సత్యారావు జిల్లా ప్రధాన న్యాయస్థానం అదనపు ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ల కాలపరిమితి గల ఈ పదవిలో ఆయన జిల్లా ప్రధాన న్యాయస్థానంలో, సీనియర్‌ సివిల్‌ న్యాయస్థానాల్లో ప్రభుత్వంపై దాఖలయ్యే అన్ని సివిల్‌ కేసులలో రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదిస్తారు. సత్యారావు రెండు దశాబ్దాలుగా న్యాయవాద వృత్తిలో ఉన్నారు. ఆయన నియామకం పట్ల రాష్ట్ర బార్‌కౌన్సిల్‌ ఉపాధ్యక్షుడు కె.రామజోగేశ్వరరావు, కౌన్సిల్‌ సీనియర్‌ సభ్యుడు ఎస్‌.కృష్ణమోహన్‌, బైపా అరుణ్‌కుమార్‌, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జి.ఎం.రెడ్డి, సీనియర్‌ న్యాయవాదులు ఎన్‌.వి.సుమన్‌, కె.ఎస్‌ఎ.రాజు, సురేష్‌కుమార్‌, పాకా సత్యనారాయణ, పప్పు అనురాధ తదితర న్యాయవాదులు హర్షం ప్రకటించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని