ప్రజాతీర్పు మా బాధ్యతను మరింత పెంచింది: మంత్రి
eenadu telugu news
Published : 26/09/2021 03:58 IST

ప్రజాతీర్పు మా బాధ్యతను మరింత పెంచింది: మంత్రి

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: ప్రాదేశిక ఎన్నికల్లో జిల్లా ప్రజలు వైకాపాకు అనుకూలంగా ఇచ్చిన తీర్పుతో తమపై బాధ్యత మరింత పెరిగిందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. కీలకమైన జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ పదవికి పీటీజీ తెగకు చెందిన గిరిజన మహిళను ముఖ్యమంత్రి ఎంపిక చేయడం పట్ల హర్షం వెలుబుచ్చారు. శనివారం సాయంత్రం జడ్పీ సమావేశమందిరంలో జరిగిన జడ్పీ తొలి సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 39 జడ్పీటీసీలకు 36 చోట్ల వైకాపా అభ్యర్థులు విజయం సాధించడం విశేషమన్నారు. 67శాతం ప్రజలు వైకాపాకు ఓట్లు వేశారన్నారు. స్థానిక శాసనసభ్యులు, ఎంపీలు, జడ్పీటీసీలు బృందంగా ఏర్పడి జిల్లాను అగ్రస్థానంలో నిలపాలన్నారు.

* అనంతరం జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన జల్లిపల్లి సుభద్ర, ఉపఛైర్మన్లగా ఎన్నికైన తుంపాల అప్పారావు, భీశెట్టి వరాహ సత్యవతిలను సత్కరించారు. జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున, జడ్పీ సీఈఓ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ బి.మాధవి, ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు ,ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాధ్‌, కరణం ధర్మశ్రీ, కన్నబాబురాజు, గొల్లబాబూరావు, కె.భాగ్యలక్ష్మి, శెట్టి ఫల్గుణ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని