భారత్‌బంద్‌కు టీఎన్‌టీయూసీ మద్దతు
eenadu telugu news
Published : 26/09/2021 03:58 IST

భారత్‌బంద్‌కు టీఎన్‌టీయూసీ మద్దతు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ 500 రైతు సంఘాల మద్దతుతో ఏర్పాటైన సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపును అనుసరించి ఈనెల 27న జరగనున్న భారత్‌ బంద్‌కు టీఎన్‌టీయూసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బంద్‌లో కార్మిక, ఉద్యోగ సంఘాలు, ప్రజలు, రాజకీయపక్షాలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. శనివారంతెదేపా కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతి శివాజీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయన్నారు. రాష్ట్ర నాయకులు లెనిన్‌బాబు, బండారు అప్పారావు మాట్లాడుతూ విశాఖ ఉక్కును ప్రభుత్వరంగంలో కొనసాగించేందుకు సీఎం జగన్‌ కృషి చేయాలన్నారు. విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు విళ్లా రామ్‌మోహన్‌కుమార్‌ మాట్లాడుతూ ఉక్కు నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వాలు భరోసా ఇవ్వాలన్నారు. నాయకులు నక్క లక్ష్మణరావు, ఉప్పిలి రామకృష్ణ, ఎంఎస్‌ కృష్ణ, మాసి వెంకటరమణమూర్తి, కనకమహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని