అప్పన్న సేవలో ప్రముఖులు
eenadu telugu news
Published : 26/09/2021 03:58 IST

అప్పన్న సేవలో ప్రముఖులు


అమ్మవారి సన్నిధిలో జస్టిస్‌ డి.రమేశ్‌ దంపతులు

సింహాచలం, న్యూస్‌టుడే: సింహాద్రి అప్పన్న స్వామిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌, మాజీ ఎంపీ ప్రదీప్‌ చంద్రదేవ్‌, ఐక్యరాజ్య సమితి శాంతి రాయబారి వెంకట భవాని అరుణ్‌, విశాఖ జెడ్పీ వైఎస్‌ ఛైర్మన్‌ భీశెట్టి వరాహ సత్యవతి ఆలయానికి విచ్చేశారు. వారికి అధికారులు స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలినంగనం చేసుకుని బేడామండపం ప్రదక్షిణం చేశారు. అంతరాలయంలో స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. ఈవో సూర్యకళ స్వామివారి ప్రసాదం అందజేశారు.


జస్టిస్‌ ఎం.గంగారావు దంపతులకు ప్రసాదం అందజేస్తూ..

కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో..

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: పాతనగరం బురుజుపేటలో కొలువైన కనకమహాలక్ష్మి అమ్మవారిని శనివారం సాయంత్రం ప్రముఖులు దర్శించుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.గంగారావు దంపతులు, యునైటెడ్‌ నేషన్స్‌ ఆన్‌ పీస్‌ అంబాసిడర్‌ కె.వెంకటభవాని అరుణ్‌ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని పూజించారు. వారికి ఆలయ అర్చకులు, ఈఓ, ఏఈఓ మాధవి, రాంబాబు తదితరులు సాదరంగా స్వాగతం పలికి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని