అదుపు తప్పి డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా
eenadu telugu news
Published : 26/09/2021 03:58 IST

అదుపు తప్పి డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా


ప్రమాదానికి గురైన డీజిల్‌ ట్యాంకర్‌

అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌టుడే: షీలానగర్‌ నుంచి కాన్వెంట్‌ కూడలికి వెళ్లే పోర్టు రోడ్డులో శనివారం డీజిల్‌ లారీ ట్యాంకర్‌ బోల్తా కొట్టింది. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గాజువాక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హెచ్‌పీసీఎల్‌లో 24 వేల లీటర్ల డీజిల్‌ను నింపుకొని విజయనగరం వెళ్లేందుకు ట్యాంకర్‌ లారీ పోర్టు రోడ్డులో ప్రయాణిస్తుండగా టోల్‌గేటు సమీపంలో వేరే వాహనానికి తోవ ఇచ్చే ప్రయత్నంలో అదుపుతప్పి రోడ్డు పక్క తుప్పల్లోకి దూసుకుపోయి బోల్తా పడింది. డ్రైవర్‌ శ్రీనివాసరావుకి స్వల్ప గాయాలయ్యాయి. హెచ్‌పీసీఎల్‌ అధికారులు ట్యాంకర్‌లోని డీజిల్‌ను మరో ట్యాంకర్లలోకి పంపించి లారీని బయటకు తీయాలని నిర్ణయించారు.అయితే ఆ ప్రదేశానికి నాలుగు అడుగుల దూరంలో గెయిల్‌ గ్యాస్‌ పైపులైన్‌ ఉండటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అనంతరం పోలీసులు, పెదగంట్యాడ అగ్నిమాపక సిబ్బంది, గెయిల్‌ సిబ్బంది అటుగా వాహనాల రాకపోకలు నిలుపుదల చేసి నాలుగు క్రేన్లు సాయంతో ట్యాంకర్‌ను పైకి లేపారు. డీజిల్‌ను వేరే ట్యాంకర్‌లోకి మార్పు చేశారు. ఎటువంటి ప్రమాదం జరగకుండా పని పూర్తి చేసిన సీఐ ప్రసాద్‌, అగ్నిమాపక శాఖ అధికారి వెంకటరమణ, హెచ్‌పీసీఎల్‌, గెయిల్‌ అధికారులు, సిబ్బందిని పలువురు అభినందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని