ఉచిత న్యాయ సేవలను వినియోగించుకోండి
eenadu telugu news
Published : 26/09/2021 03:58 IST

ఉచిత న్యాయ సేవలను వినియోగించుకోండి


ప్రచార కరపత్రాన్ని విడుదల చేస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరిహరనాథశర్మ, తదితరులు

విశాఖ లీగల్‌, న్యూస్‌టుడే: జిల్లా న్యాయసేవల సాధికార సంస్థ అవగాహన సదస్సులను నిర్వహించి ప్రజల్లో చట్ట పరిజ్ఞానాన్ని పెంపొందిస్తోందని, ఉచితంగా లభించే న్యాయసేవలను వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.హరిహరనాథశర్మ అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవాసదన్‌లో జిల్లా న్యాయసేవల సాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛంద సేవా సంస్థలతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ అక్టోబరు 2 నుంచి నవంబరు 14వ తేదీ వరకు నిర్వహించే న్యాయసేవల ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం న్యాయసేవల ప్రచార కరపత్రాన్ని విడుదల చేశారు. కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తి జి.భూపాల్‌రెడ్డి, జిల్లా న్యాయసేవల సాధికార సంస్థ కార్యదర్శి కె.కె.వి. బులికృష్ణ, రాష్ట్ర బార్‌కౌన్సిల్‌ ఉపాధ్యక్షుడు కె.రామజోగేశ్వరరావు, సీనియర్‌ సభ్యులు ఎస్‌.కృష్ణమోహన్‌, తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని