అప్పన్నస్వామి క్షేత్రం.. భక్తజన సందోహం
eenadu telugu news
Published : 26/09/2021 03:58 IST

అప్పన్నస్వామి క్షేత్రం.. భక్తజన సందోహం


సింహగిరిపై ఆలయ పరిసరాల్లో భక్తజన సందోహం

సింహాచలం, న్యూస్‌టుడే: సింహాద్రి అప్పన్న స్వామి క్షేత్రం శనివారం భక్తజన సందోహంగా మారింది. విశాఖతో పాటు ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు సింహగిరికి తరలివచ్చారు. స్వామిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో కేశఖండనశాల, ప్రసాదాల విక్రయశాలలు, దర్శనం టిక్కెట్ల కౌంటర్ల వద్ద రద్దీ ఏర్పడింది. మాడవీధుల్లో దర్శనం టిక్కెట్ల కోసం భక్తులు బారులుతీరారు. నీడ లేకపోవడంతో మండుటెండలో ఇబ్బందిపడ్డారు. కేశఖండనశాల వద్ద భక్తులు రోడ్డుపైనే సేదతీరాల్సి వచ్చింది. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం అధికారులు అదనపు ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశారు. రాజగోపురం వైపు ఉన్న కౌంటర్ల వద్ద నీడ లేకపోవడంతో భక్తులు ఆరుబయటే బారులుతీరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని