బాలూ విగ్రహం ఏర్పాటుకు కృషి
eenadu telugu news
Published : 26/09/2021 03:58 IST

బాలూ విగ్రహం ఏర్పాటుకు కృషి


బాలు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న మేయర్‌ హరి వెంకటకుమారి

పెదవాల్తేరు, న్యూస్‌టుడే : సాగర తీరంలో గానగంధర్వుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కృషిచేస్తానని మేయర్‌ గొలగాని హరివెంటకుమారి అన్నారు. బీచ్‌రోడ్డు ఘంటసాల విగ్రహం వద్ద బాలసుబ్రమణ్యం ప్రథమ వర్ధంతి పురస్కరించుకొని బాలూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఘంటసాట స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యకరమం జరిగింది. డిప్యూటీ మాజీ మేయర్‌ దాడి సత్యనారాయణ, గొలగాని శ్రీనివాసరావు, సినీ నిర్మాత పి.ఎన్‌.తిలక్‌, వైకాపా నాయకులు ఆజామ్‌ఆలీ, అసోసియేషన్‌ కార్యదర్శి చెన్నా తిరుమలరావు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని