దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ సేవలు అపూర్వం
eenadu telugu news
Published : 26/09/2021 03:58 IST

దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ సేవలు అపూర్వం


సమావేశంలో మాట్లాడుతున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

మాధవధార, న్యూస్‌టుడే: పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ దేశానికి చేసిన సేవలు మరువలేనివని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. 51వ వార్డులో విశాఖ పార్లమెంట్‌ జిల్లా సెక్రటరీ టి.పద్మజ ఆధ్వర్యంలో శనివారం భాజపా కార్యాలయంలో నిర్వహించిన దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కేర్‌ అండ్‌ లవ్‌ వికలాంగుల ఆశ్రమంలో చిన్నారులకు పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాజపా మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు, విశాఖ పార్లమెంటు అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర, మండల అధ్యక్షుడు ఎస్‌.మోహన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని