కైలాసగిరిపై అభివృద్ధి పనుల పరిశీలన
eenadu telugu news
Published : 26/09/2021 03:58 IST

కైలాసగిరిపై అభివృద్ధి పనుల పరిశీలన


అభివృద్ధి పనుల గురించి తెలుసుకుంటున్న వీఎంఆర్‌డీఏ ఛైర్‌పర్సన్‌ విజయనిర్మల

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : పర్యాటక ప్రదేశం కైలాసగిరిపై ప్రపంచబ్యాంకు నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులను వీఎంఆర్‌డీఏ ఛైర్‌పర్సన్‌ అక్కరమాని విజయనిర్మల వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ వెంకటరమణరెడ్డితో కలిసి పరిశీలించారు. అక్కడ జరుగుతున్న నిర్మాణాల గురించి తెలుసుకున్నారు. శంకునామ చక్రాలను త్వరలోనే వెలిగేలా సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులకు సూచించారు. తెన్నేటిపార్కు సందర్శించారు. కార్యనిర్వాహక ఇంజినీర్‌ రామ్మోహనరావు, డీఎఫ్‌ఓ శాంతిస్వరూప్‌, పర్యవేక్షక ఇంజినీర్‌ తాతాజీ, కార్పొరేటర్‌ స్వాతి తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని