హడలెత్తించిన గిరినాగు
eenadu telugu news
Updated : 14/10/2021 09:51 IST

హడలెత్తించిన గిరినాగు


మారేపల్లిలోని ఇంట్లో బుస కొడుతున్న సర్పం

దేేవరాపల్లి, న్యూస్‌టుడే: మారేపల్లిలో మంగళవారం రాత్రి గిరినాగు ప్రజల్ని హడలెత్తించింది. ఈర్లె రాము ఇంటిలో రాత్రి సుమారు 13 అడుగుల భారీ గిరినాగు కంటపడింది. దీంతో ఆ ఇంటిలోని వారంతా కేకలు వేయడంతో పాము బుసలుకొడుతూ పడగ విప్పడంతో ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. ఇక్కడి నుంచి జారుకున్న పాము దాసరి లక్ష్మి ఇంటికి చెందిన బాతురూములోకి చేరింది. ఈ విషయాన్ని ఎస్‌ఐ పి.సింహాచలంకి ఫోను ద్వారా గ్రామస్థులు సమాచారం అందించడంతో ఆయన అటవీ సిబ్బంది ద్వారా విశాఖకు చెందిన స్నేక్‌ క్యాచర్‌ వెంకటేష్‌ బృందానికి చెప్పడంతో వారు ఇక్కడిక చేరుకుని దీనిని పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని