140 కేజీల గంజాయి పట్టివేత
eenadu telugu news
Published : 18/10/2021 05:15 IST

140 కేజీల గంజాయి పట్టివేత


పోలీసులు పట్టుకున్న గంజాయి బ్యాగులు

కోటవురట్ల, న్యూస్‌టుడే: అక్రమంగా తరలిస్తున్న 140 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై నారాయణరావు కథనం ప్రకారం.. కేరళకు చెందిన కేకే శివదాస్‌ అనే వ్యక్తి మన్యంలో గంజాయిని కొనుగోలు చేసి కారులో నర్సీపట్నం మీదుగా అడ్డురోడ్డు వైపు వెళ్తున్నారు. మార్గమధ్యంలో సుంకపూరు వద్ద ఆదివారం నిర్వహించిన వాహన తనిఖీల్లో కారులో గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బ్యాగులో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకుని శివదాస్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని