ఐ-టీడీపీ రాష్ట్ర కమిటీలో ఇద్దరికి చోటు
eenadu telugu news
Published : 19/10/2021 03:39 IST

ఐ-టీడీపీ రాష్ట్ర కమిటీలో ఇద్దరికి చోటు

కిలపర్తి రామకృష్ణ                           గెడ్డం వరహా రాజమల్లు

నర్సీపట్నం అర్బన్‌/ చోడవరం, న్యూస్‌టుడే: ఐ-టీడీపీ రాష్ట్ర కమిటీలో నర్సీపట్నం నియోజకవర్గానికి చెందిన ఇద్దరికి చోటు దక్కింది. ప్రధాన కార్యదర్శిగా నర్సీపట్నం పురపాలికలోని కొత్తవీధికి చెందిన కిలపర్తి రామకృష్ణ, కార్యదర్శిగా నర్సీపట్నం గ్రామీణ మండలం కేఎల్‌ పురానికి చెందిన గెడ్డం వరహా రాజమల్లు, చోడవరానికి చెందిన నల్లబిల్లి స్వామి నియమితులయ్యారు. పార్టీ బలోపేతానికి తాము అంకితభావంతో పని చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ప్రత్యర్థుల నుంచి కార్యకర్తలకు ఇబ్బంది ఎదురైతే రక్షణగా నిలుస్తామని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని