నేనేమి చేశాను పాపం?
eenadu telugu news
Updated : 19/10/2021 04:36 IST

నేనేమి చేశాను పాపం?

చెత్తకుండీలో ఆడశిశువు మృతదేహం

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అనకాపల్లిలోని శారదానది సమీపంలో చెత్తకుండీలో రెండురోజుల ఆడశిశువు మృతదేహం లభ్యమైంది. అనకాపల్లి పట్టణ ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... శారదానది సమీపంలోని వంతెన వద్ద చెత్త కుండీలో శిశువు మృతదేహాన్ని కనుగొన్న స్థానికులు విషయాన్ని పోలీసులకు తెలిపారు. పోలీసులు వచ్చి పరిశీలించగా రెండురోజుల క్రితం పుట్టిన ఆడశిశువు మృతదేహంగా గుర్తించారు. చెత్తకుండీలో ఎవరు పడేశారు అన్నదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ సంఘటనపై స్థానికులు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని