108లో కవల పిల్లల ప్రసవం
eenadu telugu news
Published : 19/10/2021 03:39 IST

108లో కవల పిల్లల ప్రసవం

కవల పిల్లలతో ఈఎంటీ రమణారావు, తల్లి ముక్త

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: గర్భిణిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కవల పిల్లలకు జన్మనిచ్చిన ఘటన గూడెంకొత్తవీధి మండలంలో చోటుచేసుకుంది. మర్రిపాలెం గ్రామానికి చెందిన వంతల ముక్త గర్భిణి. సోమవారం తెల్లవారుజామున పురిటినొప్పులతో ఆమె బాధపడుతుండగా స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు. సిబ్బంది అక్కడకు చేరుకుని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా నొప్పులు అధికమయ్యాయి. బిడ్డ ప్రసవించే క్రమంలో ముందుగా తల రావాల్సి ఉండగా కాళ్లు రావడంతో పరిస్థితి విషమించింది. 108 ఈఎంటీ బెండి రమణారావు సమయస్ఫూర్తితో వ్యవహరించి క్షేమంగా ప్రసవం చేశారు. పుట్టిన బాబు, పాపతోపాటు తల్లి క్షేమంగా ఉండటంతో ఈఎంటీని కుటుంబసభ్యులు అభినందించారు. ఆశా కార్యకర్త జమున, పైలట్‌ కింతలి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని