క్రీడాకారులకు అండగా ఉంటాం
eenadu telugu news
Published : 19/10/2021 03:39 IST

క్రీడాకారులకు అండగా ఉంటాం


రమణమ్మకు నియామక పత్రాన్ని అందిస్తున్న శాప్‌ ఛైర్మన్‌

చోడవరం, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) డైరెక్టరుగా జొన్నాడ రమణమ్మ సోమవారం బాధ్యతలను స్వీకరించారు. విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో కలిసి డైరెక్టరుగా బాధ్యతలను చేపట్టారు. శాప్‌ ఎండీ ప్రభాకర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమణమ్మ విలేకరులతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో క్రీడాకారులకు శాప్‌ ద్వారా సదుపాయాలను కల్పిస్తానని చెప్పారు. శాప్‌ సేవలు అన్ని ప్రాంతాలకు విస్తరించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని