AP News: ఉన్నది 63 సెంట్లు... రాసింది 63 ఎకరాలు
eenadu telugu news
Updated : 19/10/2021 07:59 IST

AP News: ఉన్నది 63 సెంట్లు... రాసింది 63 ఎకరాలు

పింఛన్‌ నిలిపివేతతో గిరిజనుడి వెతలు


తహసీల్దారు కార్యాలయం వద్ద భూమి వివరాలను ప్రదర్శిస్తున్న వాలి

రావికమతం, న్యూస్‌టుడే: విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం డోలవానిపాలెంకు చెందిన డోలా వాలి అనే గిరిజనుడిని 63 ఎకరాల భూస్వామిగా పేర్కొంటూ ఈనెల నుంచి పింఛన్‌ను నిలిపివేశారు. వాస్తవానికి ఆయనకు 63 సెంట్ల డీ పట్టా భూమి మాత్రమే ఉంది. కొండదొర తెగకు చెందిన వాలి నిరుపేద కావడంతో అతడికి 1989లో సర్వే నంబరు 1-1లో 63 సెంట్ల మెట్టు భూమిని డి.పట్టాను, పట్టాదారు పాసు పుస్తకాన్ని జారీ చేశారు. తన సమస్యను తహసీల్దారు కనకారావు దృష్టికి తీసుకెళ్లారు. ఆన్‌లైన్‌ చేసేటప్పుడు పొరపాటు జరిగి ఉంటుందన్నారు. దరఖాస్తు చేస్తే 15 రోజుల్లో సరిచేస్తామని చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని