పండగ పరవశం.. అంతలోనే అంతులేని విషాదం
eenadu telugu news
Published : 19/10/2021 03:39 IST

పండగ పరవశం.. అంతలోనే అంతులేని విషాదం

గుండెపోటుతో హవల్దార్‌ శ్రీరామ్‌ హఠాన్మరణం


పెద్దాడ శ్రీరామ్‌ (దాచిన చిత్రం)

దేవరాపల్లి, న్యూస్‌టుడే: పండగలో కుటుంబంతో ఆనందంగా గడిపారు. విధి నిర్వహణ కోసం జమ్మూ కశ్మీర్‌ వెళ్లిన సైనికోద్యోగి అంతలోనే మృత్యువాత పడడం ఆ కుటుంబాన్ని తీరని శోకంలోకి నెట్టింది. సరిహద్దుల్లో హవల్దార్‌గా పనిచేస్తున్న ఎ.కొత్తపల్లి శివారు అచ్చియ్యపాలెంకు చెందిన పెద్దాడ శ్రీరామ్‌ (42) సోమవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన తల్లిదండ్రులు సీతారాం, దేముడు. భార్య జయమ్మతో పాటు కుమారులు జోషిత్‌ (15), జువినేష్‌ (12) గాజువాక సమీపంలోని శ్రీనగర్‌లో నివాసం ఉంటున్నారు. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. దసరా సెలవులకు నెల కిందట శ్రీరామ్‌ జిల్లాకు వచ్చారు. తల్లిదండ్రులు, భార్యాబిడ్డలతో ఆనందంగా గడిపారు. అనంతరం విధుల్లో చేరడానికి ఆదివారం ఉదయం విమానంలో జమ్మూకశ్మీర్‌ చేరుకున్నారు. అక్కడ క్వారంటైన్‌లో ఉండగా సోమవారం ఉదయం గుండెపోటు వచ్చింది. వెంటనే దగ్గర్లోని ప్రాథమిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో మిలట్రీ ఆసుపత్రికి తరలించగా అక్కడ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంపై సోమవారం సాయంత్రం 4 గంటలకు మిలట్రీ అధికారుల ద్వారా సమాచారం రావడంతో ఈ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని