ఆస్తుల పరిరక్షణ... సౌకర్యాల కల్పన
eenadu telugu news
Published : 19/10/2021 04:05 IST

ఆస్తుల పరిరక్షణ... సౌకర్యాల కల్పన

సింహాచలం ధర్మకర్తల మండలి సమావేశం రేపు

సింహాచలం, న్యూస్‌టుడే: సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం బుధవారం నిర్వహించేందుకు ఈవో సూర్యకళ ఆధ్వర్యంలో అధికారులు సన్నాహాలు పూర్తి చేశారు. కృష్ణాపురం గోశాల ఆవరణలోని సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ధర్మకర్తల మండలి ఛైర్మన్‌, సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులకు 12అంశాలతో కూడిన అజెండాను అధికారులు పంపించారు. వాటిపై ఇందులో చర్చించనున్నారు. అనువంశిక ధర్మకర్తగా పూసపాటి అశోక్‌ గజపతిరాజు తొలిసారిగా పాల్గొననున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంచయిత గజపతిరాజు ఛైర్‌పర్సన్‌గా ఈ మండలిని ఏర్పాటు చేశారు. అంతకు ముందు ఈ మండలి లేకపోవడంతో నేరుగా ఛైర్మన్‌ నిర్ణయాలు తీసుకునే వారు. భక్తులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు...అప్పన్న ఆస్తుల పరిరక్షణ అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సింహగిరి చుట్టూ ఉన్న దేవస్థానం భూములను పరిరక్షించేందుకు తొమ్మిది ప్రాంతాల్లో సుమారు 16 కిలోమీటర్ల మేర అసంపూర్తిగా నిలిచిపోయిన రక్షణ గోడ నిర్మాణానికి అనుమతులు కోరుతూ తీర్మానం చేయాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ ఎన్‌ఎస్‌టీఎల్‌కు 1973, 1985లో దేవస్థానం కేటాయించిన సుమారు 37.75 ఎకరాలకు సంబంధించి ఇంత వరకు ఆ సంస్థ నుంచి ఎలాంటి పరిహారం రాలేదు. దాన్ని రాబట్టే విషయంపైనా చర్చింనున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని