విస్సన్నపేట భూముల వ్యవహారంలో వీఆర్వోలకు మెమోలు
eenadu telugu news
Published : 19/10/2021 04:05 IST

విస్సన్నపేట భూముల వ్యవహారంలో వీఆర్వోలకు మెమోలు

కశింకోట, న్యూస్‌టుడే: కశింకోట మండలం విస్సన్నపేటలో భూముల ఆక్రమణ పర్వానికి సంబంధించి తగిన సమాచారం అందించలేదంటూ ఇద్దరు వీఆర్వోలకు తహసీల్దారు మెమోలు జారీచేశారు. బయ్యవరం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 195/2 లో దళితులకు ఇచ్చిన 609 ఎకరాల భూమిలో కొందరు వ్యక్తులు ఇప్పటికే 200 ఎకరాలు కొనుగోలు చేసి ప్రభుత్వ స్థలాలను కలుపుకొని భూమిని చదును చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అధికారులకు సకాలంలో ఎటువంటి సమాచారం ఇవ్వని కారణంగా బయ్యవరం వీఆర్వో టి.అప్పారావు, జమాదులపాలెం వీఆర్వో ఆర్‌.వి.నారాయణరావులకు ఆర్‌డీఓ ఆదేశాల మేరకు మెమోలు జారీ చేసినట్లు తహసీల్దారు బి.సుధాకర్‌ తెలిపారు. ఈ భూముల్లో ఎటువంటి పనులు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తహసీల్దారు వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని