లోకేష్‌ సభకు భారీగా జన సమీకరణ
eenadu telugu news
Published : 19/10/2021 04:05 IST

లోకేష్‌ సభకు భారీగా జన సమీకరణ

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: అనకాపల్లిలో ఈనెల 20న జరగనున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌ బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుంచి భారీగా జన సమీకరణ చేయాలని తెదేపా నేతలు నిర్ణయించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో విశాఖపట్నం, అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గాల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. పార్టీ బాధ్యులు మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో నగర, గ్రామీణ జిల్లాల అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, బుద్ధ నాగజగదీశ్వరరావు, మాజీ మంత్రులు సిహెచ్‌.అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్యే గణబాబు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, మాజీ ఎమ్మెల్యేలు వంగలపూడి అనిత, పీలా గోవిందు సత్యనారాయణ, అప్పల నర్సింహరాజు, గండి బాబ్జీ, కోళ్ల లలితకుమారి, రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు మాట్లాడారు. 20న ఉదయం 8గంటలకు ప్రత్యేక విమానంలో లోకేష్‌ విశాఖకు చేరుకుంటారని చినరాజప్ప తెలిపారు. విమానాశ్రయం నుంచి ఊరేగింపుగా అనకాపల్లి వెళతారని, అక్కడ లోక్‌సభ నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. నేతలు పి.వి.జి.కుమార్‌, కోరాడ రాజబాబు, ప్రగడ నాగేశ్వరరావు, లాలం భాస్కర్రావు, నాయకులు నజీర్‌, పీలా శ్రీనివాసరావు, చోడె వెంకట పట్టాభి, మూర్తి యాదవ్‌, లొడగల కృష్ణ, బండారు అప్పలనాయుడు, పాశర్ల ప్రసాద్‌ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని