చదువుకుంది... సెల్‌చూసింది... అంతలోనే...
eenadu telugu news
Published : 19/10/2021 04:05 IST

చదువుకుంది... సెల్‌చూసింది... అంతలోనే...

గురుద్వారా, న్యూస్‌టుడే: దొండపర్తిలో ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నాలుగో పట్టణ పోలీసులు తెలిపిన వివరాలివి. ద్వారకానగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఈ బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది. ఆదివారం రాత్రి 11 గంటల వరకు సోదరితో కలిసి ఇంట్లో చదువుకుంది. ఆ తర్వాత 12.30 గంటల వరకు తండ్రి సెల్‌ఫోన్‌ చూసింది. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో తల్లికి మెలకువ వచ్చినపుడు కుమార్తె గది డోర్‌కర్టెన్‌ పూర్తిగా ఓ వైపు జరిపి ఉండటంతో అనుమానం వచ్చి చూడగా...ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. స్థానికుల సహకారంతో బాలికను హుటాహుటిన కేజీహెచ్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గౌరీ పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని