విహారంలో విషాదం
eenadu telugu news
Published : 19/10/2021 04:05 IST

విహారంలో విషాదం

అప్పికొండ తీరంలో బాలిక గల్లంతు


దీపిక (పాతచిత్రం)

కూర్మన్నపాలెం, న్యూస్‌టుడే: కుటుంబ సభ్యులతో సరదాగా సముద్రంలో స్నానం చేసేందుకు వెళ్లిన బాలిక గల్లంతైన ఘటన అప్పికొండ సముద్ర తీరంలో సోమవారం చోటు చేసుకుంది. దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలు ఇవి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని జగన్నాథపురానికి చెందిన 12 మంది గంగవరంలోని బంధువుల ఇంటికి వచ్చారు. సోమవారం తిరుగు ప్రయాణమవ్వాల్సి ఉంది. ఇంతలో ఓసారి అప్పికొండ తీరానికి వెళ్లాలని నిర్ణయించుకొని ఆటోలో చేరుకున్నారు. స్నానం చేసేందుకు సాగరంలోకి దిగిన దీపిక(15), హరిణి(16) కెరటాల ఉద్ధృతిలో చిక్కుకున్నారు. అక్కడే ఉన్న దీపిక తండ్రి ప్రదీప్‌, మేనమామ సజీవ్‌లు స్పందించడంతో హరిణిని కాపాడగలిగారు. దీపిక కెరటాల ఉద్ధృతికి లోనికి వెళ్లిపోయింది. హరిణిని అగనంపూడిలోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. దీపిక గల్లంతైన సమాచారం స్థానికులు దువ్వాడ పోలీసులకు తెలిపారు.ఆరుగురు గజ ఈతగాళ్లు గాలించినా ఆమె ఆచూకీ తెలియరాలేదు. దువ్వాడ సీఐ టి.లక్ష్మి సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. తండ్రి ప్రదీప్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని