కనకమహాలక్ష్మి ఆలయానికి ‘ఐఎస్‌వో ధ్రువీకరణ’
eenadu telugu news
Published : 19/10/2021 04:05 IST

కనకమహాలక్ష్మి ఆలయానికి ‘ఐఎస్‌వో ధ్రువీకరణ’


ఐఎస్‌వో పత్రాన్ని ఈవో జ్యోతిమాధవికి అందజేస్తున్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

గురుద్వారా, న్యూస్‌టుడే: కనకమహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో విశాఖ నగరం అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. అమ్మవారి దేవస్థానానికి వచ్చిన ఐఎస్‌వో 9001:2015 ధ్రువపత్రాన్ని సోమవారం ఉదయం సీతమ్మధారలోని మంత్రి నివాసంలో ఆలయ ఈవో జ్యోతిమాధవి అందుకున్నారు. ఆలయ పరిసరాల్లో పరిశ్రుభత, భక్తుల పట్ల ఉద్యోగుల సేవాభావం, అందించే సౌకర్యాలు, హిందూ ధర్మ పరిరక్షణ, నాణ్యత ప్రమాణాలతోనే ఈ గుర్తింపు లభించిందని మంత్రి పేర్కొన్నారు. సహాయక ఈవో రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని