అసంఘటిత కార్మికులకు ‘ఈ-శ్రమ్‌’ నమోదు
eenadu telugu news
Published : 19/10/2021 04:34 IST

అసంఘటిత కార్మికులకు ‘ఈ-శ్రమ్‌’ నమోదు


ఎం.సునీత

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే: అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన ‘ఈ-శ్రమ్‌’ లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని శాఖల సహకారం అవసరమని కార్మికశాఖ ఉప కమిషనర్‌ ఎం.సునీత కోరారు. సోమవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో 12,86,434 మంది కార్మికులు ఈ-శ్రమ్‌కు అర్హులుగా ఉన్నారన్నారు. ఇప్పటి వరకు 47వేల మంది మాత్రమే నమోదు చేసుకున్నారన్నారు. నమోదు కాని వారికి భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల లబ్ధి దక్కకుండా పోతుందన్నారు. ఈ విషయాన్ని గుర్తించి అసంఘటిత రంగంలోని కార్మికులందరూ పేర్లు నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లను సమన్వయం చేసుకొని వీరి నమోదు ప్రక్రియ వేగవంతం చేస్తున్నామన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని