మత్స్యకారులను ఎస్సీ జాబితాలో చేర్చడానికి కృషి
eenadu telugu news
Published : 19/10/2021 04:34 IST

మత్స్యకారులను ఎస్సీ జాబితాలో చేర్చడానికి కృషి


మాట్లాడుతున్న కేంద్రమంత్రి రామదాస్‌ అఠవలే, చిత్రంలో బీసీ కమిషన్‌ జాతీయ సభ్యుడు పల్లోజు ఆచారి తదితరులు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: మత్స్యకారులను ఎస్సీల జాబితాలోకి చేర్చేందుకు తన వంతు కృషి చేస్తానని కేంద్ర సామాజిక న్యాయం, సాధికార శాఖ సహాయ మంత్రి రామదాస్‌ అఠవలే అన్నారు. సోమవారం చేపలరేవులో విశాఖ కోస్టల్‌ మరపడవల ఆపరేటర్ల సంఘం ఆధ్వర్యంలో జరిగిన జాతీయ మత్స్యకార దినోత్సవంలో కేంద్రమంత్రి పాల్గొని మాట్లాడారు. కేంద్రం పరంగా ఆయిల్‌ రాయితీ ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. జాతీయ బీసీ కమిషన్‌ సభ్యులు తల్లోజు ఆచారి మాట్లాడారు. సంఘం అధ్యక్షులు బర్రి కొండబాబు, రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కోలా గురువులు, మత్స్యశాఖ జేడీ పి.లక్ష్మణరావు, బోటు ఆపరేటర్ల సంఘాల అధ్యక్షులు సత్యనారాయణమూర్తి, అప్పారావు, పోర్టు అధికారి అవతారం నాయుడు, తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని