స్వచ్ఛ సంకల్పానికి కలిసి రావాలి..
eenadu telugu news
Published : 19/10/2021 04:34 IST

స్వచ్ఛ సంకల్పానికి కలిసి రావాలి..


జెండా ఊపి స్వచ్ఛ వాహనాలనుప్రారంభిస్తున్న జడ్పీ ఛైర్‌పర్సన్‌ సుభద్ర

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలు శుభ్రంగా ఉండాలని, ఈ మేరకు స్వచ్ఛ సంకల్పానికి అంతా కలిసి రావాలని జడ్పీ ఛైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర పిలుపు నిచ్చారు. సోమవారం సాయంత్రం జడ్పీ కార్యాలయ ఆవరణలో జగనన్న స్వచ్ఛ సంకల్ప వాహనాలను ఆమె జెండా ఊపి ప్రారంభించారు. జడ్పీ సీఈఓ నాగార్జునసాగర్‌ మాట్లాడుతూ అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అనంతరం 26వాహనాలను ప్రారంభించి స్వచ్ఛ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డీపీఓ కృష్ణకుమారి, ఆర్‌డబ్ల్యుఎస్‌ పర్యవేక్షక ఇంజినీరు రవికుమార్‌, స్వచ్ఛ సంకల్పం జిల్లా కోఆర్డినేటరు చంద్రకళ, డ్వామా పథక సంచాలకులు సందీప్‌, జడ్పీ వైస్‌ ఛైర్‌పర్సన్‌ సత్యవతి, తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని