ఏయూతో హెచ్‌.పి.సి.ఎల్‌. అవగాహన ఒప్పందం
eenadu telugu news
Published : 19/10/2021 04:34 IST

ఏయూతో హెచ్‌.పి.సి.ఎల్‌. అవగాహన ఒప్పందం


ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న వీసీ ప్రసాదరెడ్డి, హెచ్‌.పి.సి.ఎల్‌. డైరెక్టర్‌ పుష్పకుమార్‌

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే : భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని హెచ్‌.పి.సి.ఎల్‌ హెచ్‌.ఆర్‌. డైరెక్టర్‌ డాక్టర్‌ పుష్ప్‌కుమార్‌ జోషి అన్నారు. సోమవారం ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌, ఏయూ అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. ఒప్పందంలో భాగంగా బోధన, పరిశోధన రంగాల్లో రెండు సంస్థలు పరస్పర సహకారం, సమన్వయంతో పనిచేస్తాయి. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య వి.కృష్ణమోహన్‌, హెచ్‌.పి.సి.ఎల్‌ జీఎం కె.నగేష్‌, తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని