అఖిల భారత టెన్నిస్‌ పోటీల్లో ‘స్నేహ’ మెరుపులు
eenadu telugu news
Published : 19/10/2021 04:34 IST

అఖిల భారత టెన్నిస్‌ పోటీల్లో ‘స్నేహ’ మెరుపులు


ట్రోఫీతో స్నేహ

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: అఖిలభారత టెన్నిస్‌ పోటీల్లో నగర క్రీడాకారిణి ఎస్‌.స్నేహ సత్తా చాటింది. ఈ పోటీలు చెన్నైలో ఈనెల 15న ముగిశాయి. బాలికల అండర్‌-18 విభాగంలో డబుల్స్‌లో సహచర క్రీడాకారిణి ఆహుజ హ్రితి (మధ్యప్రదేశ్‌)తో కలిసి స్వర్ణ పతకం గెలుపొందింది. సింగిల్స్‌ విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకం కైవసం చేసుకుంది. కోచ్‌లు కె.బాబ్జి, ఎన్‌.సతీష్‌ ఆమెకు అభినందనలు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని