జీవీఎంసీ కమిషనర్‌గా...లక్ష్మీశ
eenadu telugu news
Published : 24/10/2021 05:37 IST

జీవీఎంసీ కమిషనర్‌గా...లక్ష్మీశ

పరిశ్రమలశాఖ సంచాలకులుగా సృజన బదిలీ

న్యూస్‌టుడే, కార్పొరేషన్‌

మహా విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్‌ డాక్టర్‌ గుమ్మళ్ల సృజనను పరిశ్రమలశాఖ సంచాలకులుగా  ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమె స్థానంలో తూర్పు గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్‌ లక్ష్మీశాను నియమించారు. కర్ణాటక రాష్ట్రం తుముకూరు జిల్లాకు చెందిన లక్ష్మీశా 2013 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. గతంలో పార్వతీపురం ఐటీడీఓ పీఓగా పనిచేశారు.
బీ సృజన.. జిల్లా సంయుక్త కలెక్టర్‌గా, జీవీఎంసీ కమిషనర్‌గా ఐదేళ్లు నగరంలోనే విధులు నిర్వహించారు. జీవీఎంసీ ఎన్నికల సందర్భంగా ఆమె సెలవు పెట్టడంతో...అప్పటి ఈపీడీసీఎల్‌ సీఎండీ నాగలక్ష్మిని కమిషనర్‌గా నియమించింది. స్థానిక ఎన్నికల అనంతరం తిరిగి కమిషనర్‌గా సృజననే ప్రభుత్వం నియమించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

అనధికార నిర్మాణాల కూల్చివేత...

వైకాపా ప్రభుత్వం ఏర్పాటైన తరువాత నగరంలో అనధికారిక నిర్మాణాల తొలగింపునకు కమిషనర్‌ సృజన ప్రాధాన్యం ఇచ్చారు. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుల భవనాలను లక్ష్యంగా చేసుకున్నారనే విమర్శలు వచ్చాయి. ప్రతి రోజూ 10 నుంచి 12 భవనాలపై చర్యలు తీసుకున్నారు. కొత్త పాలకవర్గం ఏర్పాటైన తరువాత తమకు విలువ ఇవ్వడంలేదని, తమ మాట వినడంలేదని కమిషనర్‌పై అధికార పార్టీకి చెందిన కొంత మంది కార్పొరేటర్లు ముఖ్య నేతలకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూలో అక్రమాలను గ్రహించిన ఆమె వాణిజ్య సముదాయాలలో దుకాణాలన్నిన్నీ ఖాళీ చేయించి, తిరిగి గుత్తకిచ్చేలా ప్రతిపాదించారు. దీనిపై ఒత్తిళ్లు వచ్చినా తలొగ్గలేదు. లీజు బకాయిల వసూళ్లలో మాత్రం వైఫల్యం చెందారు. వివాదాస్పద అంశాలైన మురికివాడలు, ముడసర్లోవ పార్కు అభివృద్ధి వంటి దస్త్రాలపై ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే బదిలీ అయ్యారు.

సృజన


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని