మన్యం నుంచి అంటార్కిటికాకు..
eenadu telugu news
Updated : 24/10/2021 05:42 IST

మన్యం నుంచి అంటార్కిటికాకు..

భూ అయస్కాంత పరిశోధనలో పరధాని రమణమూర్తి

హుకుంపేట, న్యూస్‌టుడే: గిరిజన ప్రాంతంలోని నిరుపేద కుటుంబంలో పుట్టి, ప్రభుత్వ పాఠశాల్లో చదువుకొని భూఅయస్కాంత శాస్త్రవేత్తగా గుర్తింపు సాధించిన ఆ యువకుడు.. భారతదేశం తరఫున అంటార్కిటికా ఖండంలో పరిశోధనలకు ఎంపికయ్యాడు. హుకుంపేట మండలం ఉక్కుర్భ గ్రామానికి చెందిన పరధాని రమణమూర్తి అంటార్కిటికా ఖండంలో భూ అయస్కాంత పరిశోధనకు ఎంపికైన 40 మంది భారతీయ శాస్త్రవేత్తల బృందంలో ఒకరిగా ఉన్నారు. ఈయన ప్రస్తుతం గోవాలో విధులు నిర్వహిస్తున్నారు. ఈనెల 24న అంటార్కిటికా బయల్దేరనున్నట్లు రమణమూర్తి తెలిపారు. అక్కడి వాతావరణాన్ని తట్టుకునేందుకు ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ) అధికారులు హాలీ ఉత్తరాఖండ్‌లో ప్రత్యేక శిక్షణ అందించారని చెప్పారు. గిరిజన ప్రాంతంలో పుట్టి తాను ఈ స్థాయికి ఎదిగానని, గిరి యువత చదువుపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని