జిల్లాస్థాయి స్కేటింగ్‌ పోటీలు ప్రారంభం
eenadu telugu news
Published : 24/10/2021 05:37 IST

జిల్లాస్థాయి స్కేటింగ్‌ పోటీలు ప్రారంభం

ఫిగర్‌ పోటీల్లో పాల్గొన్న  స్కేటర్లు

విశాఖపట్నం, న్యూస్‌టుడే:  జిల్లా రోలర్‌ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి స్కేటింగ్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. శనివారం ఉదయం వుడా పార్కులో స్పీడ్‌, శివాజీపార్కులో ఆర్టిస్టిక్‌, భీమిలిలో రేస్‌ పోటీలు జరిగాయి. ఆర్టిస్టిక్‌ పోటీల్లో భాగంగా 9-11, 11-14, 14-17, 17 సంవత్సరాలు, ఆపై వయసుల వారీగా జరిగిన పోటీల్లో సుమారు 40 మందికిపైగా స్కేటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలుగా డాక్టర్‌ హరిణి, డాక్టర్‌ శ్రద్ధ, శశాంక్‌, చీఫ్‌ రిఫరీగా ఆకుల పవన్‌కుమార్‌ వ్యవహరించారు. జిల్లా సంఘం తరఫున శీలం లక్ష్మణ్‌, పాల్‌, విజయ్‌, కోచ్‌లు సింహాద్రి, సత్యనారాయణ, చిట్టిబాబులు పోటీలను పర్యవేక్షించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని