రొయ్యల చెరువులకు సీఏఏ రిజిస్ట్రేషన్లు
eenadu telugu news
Published : 24/10/2021 05:37 IST

రొయ్యల చెరువులకు సీఏఏ రిజిస్ట్రేషన్లు

సమావేశంలో మాట్లాడుతున్న కోటేశ్వరరావు

నక్కపల్లి, న్యూస్‌టుడే: తీర ప్రాంతాల్లోని రొయ్యల చెరువుల అనుమతులను పరిశీలించి కోస్టల్‌ ఆక్వా అథారిటీ యాక్టు (సీఏఏ) కింద త్వరలోనే రిజిస్ట్రేషన్లు చేస్తామని మత్స్య శాఖ అదనపు సంచాలకులు పి.కోటేశ్వరరావు పేర్కొన్నారు. మండల పరిషత్తు సమావేశ మందిరంలో ఆక్వా రైతులు, హేచరీ యజమానులతో శనివారం సమావేశమయ్యారు. ఆక్వా సాగును ప్రోత్సహించే క్రమంలో ప్రభుత్వం మూడు చట్టాలను అమలులోకి తెచ్చిందన్నారు. రొయ్యల చెరువులతోపాటు ఫీడ్‌ మిల్లులు, దుకాణాలు, ప్రాసెసింగ్‌ ప్లాంట్లు, ల్యాబ్‌లకూ రిజిస్ట్రేషన్లు చేస్తామన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా 18 శాతం రాయితీపై రొయ్యల మేతను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అనుమతుల్లేకుండా టైగర్‌ సీడ్‌ పెంచడానికి వీల్లేదని స్పష్టం చేశారు. చెరువుల రిజిస్ట్రేషన్‌కు పలుమార్లు దరఖాస్తు చేసినా ఫలితం లేదంటూ పలువురు రైతులు సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఇబ్బందులు ఉండవని, నిబంధనలకు లోబడి ఉన్న వాటికి అనుమతులు ఇస్తామని కోటేశ్వరరావు చెప్పారు. జేడీ లక్ష్మణరావు, మత్స్యకార సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు గురునాథరావు తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని