గంజాయి సాగును నిరాకరించిన రైతులకు సన్మానం
eenadu telugu news
Published : 24/10/2021 05:37 IST

గంజాయి సాగును నిరాకరించిన రైతులకు సన్మానం

కార్యక్రమంలో డీఐజీ రంగారావు, ఎస్పీ కృష్ణారావు

విశాఖపట్నం: గంజాయిని పండించబోమని స్వచ్ఛందంగా ముందుకొచ్చిన పలువురు గిరిజన రైతులను జిల్లా రేంజ్‌ పోలీసు కార్యాలయంలో శనివారం డి.ఐ.జి. ఎల్‌.కె.వి.రంగారావు, ఎస్పీ బి.కృష్ణారావు సన్మానించారు. గూడెంకొత్తవీధి మండలం గుమ్మిరేవుల పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో సుమారు 25 ఎకరాల్లో పండిన గంజాయి పంటను ధ్వంసం చేసి ఇక నుంచి గంజాయిని పండించకూడదని నిర్ణయించుకున్న రైతులకు ఈ సన్మానం జరిగింది. డి.ఐ.జి. రంగారావు మాట్లాడుతూ.. గిరిజన రైతులు ఈ విధంగా ముందుకు రావడం మంచి పరిణామమన్నారు. మిగతా వారు కూడా వీరిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని