జోన్‌-8 రెవెన్యూ సిబ్బందిపై స్పెన్షన్‌ ఎత్తివేత
eenadu telugu news
Published : 25/10/2021 03:58 IST

జోన్‌-8 రెవెన్యూ సిబ్బందిపై స్పెన్షన్‌ ఎత్తివేత

బదిలీపై వెళ్తూ సృజన నిర్ణయం

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: మహా విశాఖ నగరపాలక సంస్థ జోన్‌-8 రెవెన్యూ విభాగంలో ఇటీవల సస్పెన్షన్‌కు గురైన వారిపై చర్యలు ఉపసంహరిస్తూ కమిషనర్‌ సృజన నిర్ణయం తీసుకున్నారు. ఆమెకు బదిలీ కావడంతో ఆదివారం మినిస్టీరియల్‌ ఎంప్లాయీస్‌ సంఘం ఉద్యోగులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగులపై సస్పెన్షన్‌లను ఎత్తివేయాలని కోరారు. స్పందించిన సృజన సస్పెన్షన్‌కు గురైన వారిని విధుల్లోకి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. జోన్‌-8 ఆర్‌ఓ సురేష్‌ను అనకాపల్లి, ఆర్‌ఐ ఎ.ఉదయ్‌ను ప్రజారోగ్య విభాగానికి పంపించారు. జోనల్‌ కమిషనర్‌ సీసీ అనంత్‌, జోన్‌-8 వార్డు సచివాలయం పరిపాలన కార్యదర్శి అజయ్‌లను ప్రధాన కార్యాలయానికి బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. గతంలో జేసీగా పని చేసిన సృజన, జీవీఎంసీ కమిషనర్‌గా బదిలీ అయిన సందర్భంగా అక్కడి సిబ్బందిపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తి వేసినట్లు అధికారులు చెబుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని