ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న వ్యక్తి అరెస్ట్‌
eenadu telugu news
Published : 25/10/2021 03:58 IST

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న వ్యక్తి అరెస్ట్‌

మాధవధార, న్యూస్‌టుడే: భారత్‌-పాకిస్తాన్‌ టీ 20 మ్యాచ్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఒక వ్యక్తిని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) అధికారులు ఆదివారం పట్టుకున్నారు. మాధవధారలోని ఓ బహుళ అంతస్థు భవనంలో నివాసం ఉంటున్న లాలం ప్రభాకర్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో అతడ్ని విచారించగా 14 మంది ఇందులో పాల్గొన్నట్లు వెల్లడైంది. నిందితుడి నుంచి రూ.88 వేల నగదు, రెండు మొబైల్‌ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌, రెండు చెక్‌ బుక్‌లు, రెండు ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకొని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. ఎక్కడైనా బెట్టింగ్‌ నిర్వహిస్తే సాంకేతిక సమాచారం ద్వారా తెలుసుకొని సంబంధీకుల్ని అదుపులోకి తీసుకుంటామని హెచ్చరించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎయిర్‌పోర్టు పోలీసులు పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని