ఆక్రమిత స్థలంలో నిర్మాణంపై విచారణ
eenadu telugu news
Published : 27/10/2021 02:17 IST

ఆక్రమిత స్థలంలో నిర్మాణంపై విచారణ

వాహనం దిగకుండా వెళ్లిపోతున్న అధికారులు

కోటవురట్ల, న్యూస్‌టుడే: అన్నవరం సమీపంలో కొండను ఆక్రమించి గ్రావెల్‌ తవ్వకాలు చేపట్టడంపై అధికారులు మంగళవారం విచారణకు వచ్చారు. సర్వే నంబరు 62-10, 257లో ఉన్న కొండ ప్రాంతంలో సుమారు రూ.50 లక్షల విలువ చేసే గ్రావెల్‌ను అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు తరలించారని, నాలుగు ఎకరాల భూమిని చదును చేసి అందులో కర్రల మిల్లు నిర్మిస్తున్నారంటూ గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. దీనిపై మంగళవారం మైనింగ్‌ అధికారులు, రెవెన్యూ సిబ్బంది సంయుక్తంగా విచారణకు వచ్చారు. అయితే అధికారులు కారు దిగకుండానే తవ్వకాలు జరిగిన ప్రదేశాన్ని, నిర్మాణాలను పరిశీలించి వెళ్లిపోయారు. డిప్యూటీ తహసీల్దార్‌ సోమశేఖర్‌ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ.. గ్రామస్థుల ఫిర్యాదు మేరకే మైనింగ్‌ అధికారులు స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చి వెళ్లారని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని