రైతుల ఖాతాలకు Rs 156.46 కోట్ల జమ
eenadu telugu news
Published : 27/10/2021 02:17 IST

రైతుల ఖాతాలకు Rs 156.46 కోట్ల జమ

రైతులకు చెక్కు అందజేస్తున్న కలెక్టర్‌ మల్లికార్జున, ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే ధర్మశ్రీ, జేసీ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: రైతులకు లబ్ధి చేకూర్చే పలు పథకాలను మంగళవారం తాడేపల్లి నుంచి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు. కలెక్టరేట్‌ నుంచి వీసీలో పాల్గొన్న కలెక్టర్‌ మల్లికార్జున మాట్లాడుతూ ఈ మూడు పథకాల కింద రెండు విడతలుగా రూ.156.46కోట్ల నిధులు రైతుల బ్యాంకు ఖాతాలకు జమజేసినట్లు తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా 94 గ్రూపులకు రూ.82.52లక్షలు రాయితీగా ఇచ్చామన్నారు.  వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం 9398 రైతులకు రూ.1.38కోట్లు అందజేసినట్లు పేర్కొన్నారు.లబ్ధిదారులైన ముత్యంగి విశ్వేశ్వరరావు (హుకుంపేట), సిహెచ్‌.అర్జునరావు (చోడవరం) మాట్లాడుతూ ప్రభుత్వ సాయంతో తమకెంతో మేలు జరుగుతోందన్నారు. వీసీలో జేసీ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, ఎంపీ బి.సత్యవతి, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, జడ్పీ ఛైర్‌పర్సన్‌ సుభద్ర, డీసీసీబీ ఛైర్‌పర్సన్‌ సిహెచ్‌.అనిత, వ్యవసాయశాఖ జేడీ లీలావతి తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని