మెరుగైన కేన్సర్‌ వైద్య సేవలే లక్ష్యం
eenadu telugu news
Published : 27/10/2021 05:20 IST

మెరుగైన కేన్సర్‌ వైద్య సేవలే లక్ష్యం

పోలీస్‌ కమిషనర్‌ సిన్హాకు జ్ఞాపిక అందిస్తున్న డాక్టర్‌ ఉమేష్‌ మహంత్‌ శెట్టి

అగనంపూడి, న్యూస్‌టుడే : రోగులకు మెరుగైన కేన్సర్‌ వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వైద్యులు, సిబ్బంది పని చేయాలని నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా కోరారు. అగనంపూడి హోమీ బాబా కేన్సర్‌ ఆసుపత్రిలో మంగళవారం పోలీసు అమర వీరుల స్మారక, అవినీతి నిరోధక వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కేన్సర్‌ మాదిరి అవినీతి సమాజానికి ప్రమాదకరమన్నారు.  ప్రతి ఉద్యోగి నీతి, నిజాయితీతో పారదర్శకంగా పని చేసి... కేన్సర్‌ను అరికట్టాలన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ ఉమేష్‌ మహంత్‌ శెట్టి ఆధ్వర్యంలో కమిషనర్‌ను సత్కరించి జ్ఞాపిక అందించారు. వివిధ విభాగాల అధికారులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని