రైల్వేలో పారదర్శకతకు పెద్దపీట
eenadu telugu news
Published : 27/10/2021 05:20 IST

రైల్వేలో పారదర్శకతకు పెద్దపీట

విభాగాధికారులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న తూ.కో. జీఎం విద్యా భూషణ్‌

జ్ఞానాపురం, న్యూస్‌టుడే: రైల్వేలోని అన్ని విభాగాల్లో అవినీతి నిర్మూలను అధికారులు, కార్మికులు కృషి చేయాలని తూర్పుకోస్తా రైల్వే జీఎం విద్యాభూషణ్‌ కోరారు. రైల్వే డీఆర్‌ఎం కార్యాలయంలో మంగళవారం విజిలెన్స్‌ అవగాహన వారోత్సవాలను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాలొన్న జీఎం అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఆయన మాట్లాడుతూ నవంబరు 1వ తేదీ వరకు వాల్తేరు డివిజన్‌లో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రైల్వేలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని, సిబ్బందిలో జవాబుదారితనాన్ని పెంపొందించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ సతపతి, తదితరులు పాల్గొన్నారు.

నవీకరించిన శాటిలైట్‌ డిపో, యూనిమ్యాట్‌ యంత్రం ప్రారంభం

జ్ఞానాపురం, న్యూస్‌టుడే: నగరంలోని ట్రాక్‌ మెషిన్‌ కార్యాలయాన్ని జీఎం విద్యాభూషణ్‌ మంగళవారం సందర్శించారు. నవీకరించిన శాటిలైట్‌ డిపో, ట్రాక్‌ నిర్వహణలో కీలకమైన యూనిమ్యాట్‌ యంత్రాన్ని డీఆర్‌ఎంతో కలిసి ప్రారంభించారు. అనంతరం డీఆర్‌ఎం కార్యాలయంలో అధికారులతో సమావేశమై డివిజన్‌లో అభివృద్ధి పనులపై సమీక్షించారు.
రైల్వేశాఖ పురోభివృద్ధిలో కార్మికులది కీలక పాత్ర
తాటిచెట్లపాలెం, న్యూస్‌టుడే : రైల్వే కార్మికులు ఒక కుటుంబంలా కలిసిపోయి విధులు నిర్వహిస్తూ సంస్థ పురోభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారనిఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ విద్యా భూషణ్‌ పేర్కొన్నారు. తాటిచెట్లపాలెం ధర్మానగర్‌లోని కల్యాణమండపంలో మంగళవారం జరిగిన ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే శ్రామిక కాంగ్రెస్‌ యూనియన్‌ 9వ ద్వైవార్షిక మహాసభల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైల్వే కార్మికుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ సతపతి, యూనియన్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌.ఎల్‌.సాహూ, ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే శ్రామిక కాంగ్రెస్‌ అధ్యక్షులు జె.సంసత్‌కుమార్‌, తమ్మినేని నరశింగరావు, జిల్లా కోఆర్డినేటర్‌ మళ్లీశ్వరరావు, కోటేశ్వరరావు పాల్గొన్నారు.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని