అప్పన్న సన్నిధిలో వైభవంగా ఆర్జిత సేవలు
eenadu telugu news
Published : 27/10/2021 05:20 IST

అప్పన్న సన్నిధిలో వైభవంగా ఆర్జిత సేవలు

ప్రత్యేక అలంకరణలో దేవతామూర్తులు

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి దేవాలయంలో మంగళవారం పలు ఆర్జిత సేవలు వైభవోపేతంగా జరిగాయి. తొలుత అర్చకులు స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ఆరాధన, బాలభోగం సేవలు నిర్వహించారు. దేవేరుల సమేతుడైన గోవిందరాజ స్వామిని చూడముచ్చటగా అలంకరించి ఆలయ కల్యాణ మండపంలోని వేదికపై అధిష్ఠింపజేశారు. వేదమంత్రాలు, నాదస్వర మంగళవాయిద్యాల నడుమ దేవతామూర్తుల పరిణయోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వ్రత మండపంలో లక్ష్మీనారాయణ వ్రతాలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. భక్తులు పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని