ఐదు రైళ్లకు ఎల్‌హెచ్‌బీ బోగీలు
eenadu telugu news
Published : 27/10/2021 05:32 IST

ఐదు రైళ్లకు ఎల్‌హెచ్‌బీ బోగీలు

ఈనాడు-విశాఖపట్నం: వాల్తేరు డివిజన్‌లోని ఐదు రైళ్లకు లింక్‌ హాఫ్‌మన్‌ బుష్చ్‌ (ఎల్‌హెచ్‌బీ) బోగీలు ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించనున్నట్లు తూర్పుకోస్తా రైల్వే తెలిపింది.  కె.రవితేజ అనే వ్యక్తి సమాచారహక్కు చట్టం ద్వారా కోరిన మేరకు అధికారులు ఈ వివరాలు వెల్లడించారు. తూర్పుకోస్తారైల్వేలోని 3 డివిజన్లలో మొత్తం 10 రైళ్లు ఎల్‌హెచ్‌బీగా మారతాయని, ఇందులో విశాఖమీదుగా నడిచే 5 రైళ్లున్నట్లు లేఖ ద్వారా బదులిచ్చారు.

రైలునెంబరు - మార్గం (రైలు పేరు)
* 18463/64: భువనేశ్వర్‌- బెంగళూరు (ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌)

 * 12803/04, 12807/08: విశాఖపట్నం-నిజాముద్ధీన్‌ (స్వర్ణజయంతి, సమతా ఎక్స్‌ప్రెస్‌)

* 12805/06: విశాఖపట్నం-లింగంపల్లి (జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌)

 * 58501/02: విశాఖపట్నం-కిరండూల్‌ (కిరండూల్‌ ప్యాసింజర్‌)

 * 58537/38: విశాఖపట్నం-కొరాపుట్‌ (కొరాపుట్‌ ప్యాసింజర్‌)

 * స్వర్ణజయంతి, సమతా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు కలిపి రేక్‌షేరింగ్‌ పద్ధతిన ఎల్‌హెచ్‌బీలను కేటాయిస్తున్నారు. ఈ రైళ్లు వేర్వేరు రోజుల్లో తిరుగుతున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని