తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి హౌస్‌ అరెస్ట్‌
eenadu telugu news
Published : 27/10/2021 11:35 IST

తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి హౌస్‌ అరెస్ట్‌

విశాఖపట్నం: నగరంలోని రుషికొండ వద్ద పర్యావరణానికి విఘాతం కలిగించేలా నిర్మాణాలు చేపడుతున్నారంటూ విశాఖ నగర తెదేపా నిరసనకు పిలుపునిచ్చింది. దీంతో తెదేపా శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో తెదేపాకు చెందిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును పోలీసులు గృహనిర్బంధం చేశారు. విశాఖ ఎంవీపీ కాలనీలోని వెలగపూడి ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. ఎమ్మెల్యేను గృహనిర్బంధం చేయడంతో పాటు మరికొంతమంది తెదేపా నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రుషికొండలోని హరిత రిసార్ట్‌ ప్రాంతంలో చేపడుతున్న నిర్మాణాలను తెదేపా వ్యతిరేకిస్తోంది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని